ELR: పోలవరం మండలం జగన్నాథపేటకు చెందిన పద్మనాభుని శ్రీను ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాజమండ్రి నుంచి వచ్చిన శ్రీను దంపతులు తాళాలు పగిలిన బీరువాను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ బాలసురేష్, SI పవన్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 27 కాసుల బంగారం, 4 కేజీల వెండి, రూ.8.60 లక్షలు అపహరణకు గురైనట్లు తెలిపారు.