SKLM: శ్రీకాకుళం నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. గత కొద్ది రోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అవస్థలు పడుతున్న ప్రజానీకానికి తాజాగా కురిసిన వర్షం ఊరటనిచ్చింది. దీంతో మండు వేసవిలో సిక్కోలు చల్లబడింది. శ్రీకాకుళం నగరంలో వర్షం కురవడంతో ఆహ్లాదకరంగా కనిపించింది. దీంతో పలువురు ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.