NRML: బైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదు ధరల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.