PLD: మిర్చి లోడ్‌తో బయలుదేరిన లారీ సత్తెనపల్లి చెక్‌పోస్ట్ వద్ద బుధవారం రెండు గేదెలను ఢీకొట్టింది. దీంతో ఆ గేదెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అధిక సంఖ్యలో అక్కడికి రావడంతో డ్రైవర్ భయాందోళనకు గురై లారీని ఆపకుండా పరారయ్యాడు. ముందస్తు సమాచారంతో రాజుపాలెంలో పోలీసులు ఆ లారీని ఆపి స్టేషన్‌కు తరలించారు.