ELR: నూజివీడు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డికి సీఐటీయూ తరఫున బుధవారం సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలోకి మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు వెళుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యం అన్నారు.