SRD: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోకు 30 కొత్త బస్సులు మంజూరైనట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. నారాయణఖేడ్‌లో నూతన బస్సులను బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి మరిన్ని బస్సులు మంజూరు చేసేలా కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు మెరుగైన ఆర్టీసీ సేవలు అందిస్తామని పేర్కొన్నారు.