MBNR: జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్ర మహబూబ్నగర్ జిల్లాలో విజయవంతం అయిందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు.