KMM: పోరాడి తెచ్చుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి, కార్మిక వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతోందని, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి అన్నారు. బుధవారం చింతకాని మండల పార్టీ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో వారు పాల్గొన్నారు. 20న జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.