ATP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి సోమన్న, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్ డా. వినోద్ కుమార్ బుధవారం మీడియాకు తెలిపారు. మే 17న జరగనున్న JNTU స్నాతకోత్సవం కార్యక్రమానికి వారు హాజరవుతారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.