KMR: ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన చాకలి మీనాకు సీఎంఆర్ఎఫ్ కింద విడుదలైన రూ.60 వేల చెక్కును బుధవారం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంజూరు చేయించారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, మోహన్ రెడ్డి, నరసింహులు, దత్తు, శివ ప్రసాద్, నారాయణ, విట్టల్ పాల్గొన్నారు.