JN: స్టేషన్ ఘన్పూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 6 వాహనాలను బుధవారం వేలం వేస్తున్నట్లు సీఐ భాస్కర్ రావు తెలిపారు. ఈ వాహనాలల్లో మూడు వాహనాలు నడిచేవి కాగా, మరో 3 వాహనాలు స్క్రాప్ క్రింద అమ్మడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వేలంపాటలో పాల్గోనాలని, ఉదయం 11 గంటల నుండి వేలం పాట జరుగుతుందని పేర్కొన్నారు.