SRD: సిర్గాపూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై వర్షపు నీరు నిలిచాయి. మండలంలోని ఉజలంపాడ్, వాసర్, వంగ్డాల్, కిషన్ నాయక్ తండా, పొట్పల్లి గ్రామ శివారుల్లో బుధవారం ఉదయం భారీ వర్షం పడింది. దాంతో పంట పొలాల్లో, చిన్న పిల్ల కాలువలు, వాగుల్లో వర్షం నీరు నిలిచింది. రోడ్లపై గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో రవాణా రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.