MDK: వేసవి శిక్షణ శిబిరం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని DYSO దామోదర్ రెడ్డి సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులకు వాలీబాల్ కిట్ అందజేశారు, ప్రభుత్వం నుండి స్నాక్స్ పంపిణీ చేశారు. శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్నారు.