KNR: గంజాయి కొనుగోళ్లు జరుపుతున్నారనే సమాచారం మేరకు హుజురాబాద్ పోలీసులు ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.