KNR: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ (న్యాయ కళాశాల) అనుమతుల కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అప్లై చేసుకోగా.. మూడేళ్ల లా డిగ్రీకి అనుమతులు లభించాయని VC ఉమేష్ కుమార్ తెలిపారు. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.