GNTR: ఈ నెల 17న జరిగే బీట్ ది హీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సబ్‌కలెక్టర్ సంజన సింహా పిలుపునిచ్చారు. మంగళవారం తెనాలి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వేసవిలో వేడిమిని తట్టుకునే సూచనలతో ఈ కార్యక్రమం సాగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ మూడో శనివారం ఈ కార్యక్రమం డిసెంబర్ 2025వరకు నిర్వహిస్తారని తెలిపారు.