AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి జీతాలు పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని రూ.375కు పెంచగా, నెలకు అత్యధికంగా రూ.27వేలుగా నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.