SKLM: సోంపేట మండలం బారువ బీచ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు రోజులపాటు జరగనున్న ఈ బీచ్ ఫెస్టివల్లో ఇసుకతో చేసిన సైకతశిల్పం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సైకతశిల్పంలో ఆలీవ్ రిడ్లే తాబేళ్లు, బారువ లైట్ హౌస్ తదితర ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యాటకులు ఎంతో ఆసక్తిగా రూపొందించిన సైకితశిల్పాన్ని ఆసక్తిగా చూశారు.