PLD: అమరావతి రైతులను దగా చేసినవాడే సీఎం చంద్రబాబు నాయుడు అని మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు విమర్శించారు. వినుకొండలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 29 గ్రామాల రైతులు ధర్నాలు చేస్తే అభినందించిన చంద్రబాబు, ఇప్పుడు 53వేల ఎకరాలకు అదనంగా 46 వేల ఎకరాలు తీసుకుంటానంటూ ప్రకటనలు చేస్తున్నారని గుర్తుచేశారు. కొంతమంది వైసీపీ కార్యకర్తల పింఛన్లు రద్దు చేయడం దారుణమన్నారు.