జనగాం: వికలాంగుల హక్కుల సాధన సమితి సభ్యులు జనగామ పట్టణ కేంద్రంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేష్ హాజరై మాట్లాడుతూ.. వికలాంగుల హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం మే 19న జనగామ కలెక్టర్ కార్యాలయం వద్ద 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నారు. దీని కోసం నేటి నుండి మే 15వ తేదీ వరకు లక్ష సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు.