HYD: OU సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ పరీక్షా కేంద్రంలో NEETకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన ఇద్దరు యువతులను అధికారులు పరీక్షా హాల్లోకి అనుమతించలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన విద్యార్థినులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారు ఎంత విజ్ఞప్తి చేసినా అధికారులు నిబంధనలు ఉల్లంఘించలేమని స్పష్టం చేశారు.