KNR: శంకరపట్నం ప్రధాన రహదారిపై లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వరి ధాన్యం బస్తాలు జారీ రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటనలో వరి ధాన్యం బస్తాలు కింద పడడంతో ధాన్యం బస్తాలు చిరిగిపోయి వడ్లు రోడ్డు మీద పడ్డాయి. చెల్లాచెదురుగా పడిన వరి ధాన్యం బస్తాలతో ఎలాంటి ప్రమాదం జరగలేదని వాహనదారులు తెలిపారు. రోడ్డుపై ధాన్యం బస్తాలు పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.