HYD: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి వివాహిత లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం శ్రీకాకుళం అని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.