సంగారెడ్డి: పటాన్చెరు నియోజకవర్గం నల్లవల్లి గ్రామంలో 88వ రోజు డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా రిలే నిరసన దీక్షలు కొనసాగించారు. గుమ్మడిదల మున్సిపాలిటీ నల్లవల్లి గ్రామ పరిధిలోని ప్యారా నగర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. వద్దురా నాయన డంపింగ్ యార్డ్ వద్దు అంటూ నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యేంతవరకు మా పోరాటం ఆగదన్నారు.