GNTR: కాకినాడ పర్యటనకు వెళ్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం భీమడోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేయడానికి ఆయన తన కాన్వాయ్‌ను ఆపారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అనంతరం మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.