AP: అభివృద్ధికి చిరునామాగా MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గాన్ని మార్చారని మంత్రి లోకేష్ కితాబిచ్చారు. రూ.47 కోట్లతో 339 అభివృద్ధి పనులను కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేయడం రికార్డు అని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో కోటంరెడ్డి రూ.231 కోట్ల విలువైన పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్న కోటంరెడ్డి కృషి ఆదర్శమని ప్రశంసించారు.