AP: అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్యంపై కేంద్రం దృష్టి సారించింది. త్వరలో కొన్ని అంగన్వాడీలకు శుద్ధజల పరికరాలను అందించనుంది. ఈ పథకానికి ‘సక్షం’ పథకం అని పేరు పెట్టింది. సొంత భవనం, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విశాలమైన ప్రాంతం, విద్యుత్ సరఫరా, ఇంకుడు గుంత ఉన్న కేంద్రాలను ఈ పథకానికి ఎంపిక చేయనుంది. ఇందులో భాగంగా గుంటూరు కారంపూడి మండలంలో మూడు కేంద్రాలను ఎంపిక చేసింది.