W.G: నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ తుఫాన్ సెంటర్ వద్ద నరసాపురం నియోజకవర్గ సూపర్ సిక్స్ పథకాలు విజయోత్సవ సభ శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజల కోసం, ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.