NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో B.Ed, B.P.Ed 2, 4 సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు కొనసాగుతున్నాయని అకడమిక్ అడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. శనివారం జరిగిన పరీక్షలకు 100 మందికి 90 మంది హాజరయ్యారని 10 మంది మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.