ADB: రానున్న గణేష్ ఉత్సవాలను శాంతి భద్రతలతో నిర్వహించాలని MRO జాడి రాజలింగం అన్నారు. శనివారం నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడంతో పాటు వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ అఖిల్, రెడ్డి నాయక్, గజానంద్ నాయక్ ఉన్నారు.