VSP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.