AP: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 4,71,386, ఔట్ ఫ్లో 5,05,150 క్యూసెక్కులు నమోదవుతోంది. ఎడమగట్టు 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 21,775, 10 స్పిల్ వే గేట్లు 18 అడుగులు ఎత్తి 4,18,060 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యామ్ నీటిమట్టం 881.50 అడుగుల్లో ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, 196.11 టీఎంసీలు ఉంది.