పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా 2:35 గంటల నిడివితో థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అమెరికాలో ఈ నెల 29 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ తెలిపింది. సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలు ఉంటాయని పేర్కొంది.