SRPT: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి రాక కొనసాగుతోంది. శనివారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 4,368 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లను పైకెత్తి 2,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా మూసీ కుడి, ఎడమ కాల్వలకు 530 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువుకు విడుదల చేస్తున్నారు.