PDPL: జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ డా.శ్రీధర్ తెలిపారు. బెడ్స్ నిండినా ఎవరినీ వెనక్కి పంపకుండా ఫోల్డింగ్ మంచాలపై చికిత్స అందిస్తున్నామన్నారు. అవసరమైన మందులందిస్తున్నామని, రక్తపరీక్షలు ఆసుపత్రిలోనే చేస్తున్నామని పేర్కొన్నారు. 100 పడకల కొత్త ఆసుపత్రి పూర్తైతే స్థల సమస్య తగ్గుతుందని వివరించారు.