పని ఒత్తిడి, తీరిక లేని బాధ్యతల మధ్య ఒత్తిడి పెరుగుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే అనారోగ్యానికి దారి తీస్తుంది. అందుకే చిరాకు, అలసట నుంచి స్వాంతన పొందేందుకు అరోమా థెరపీ స్నానం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వేడినీళ్లల్లో 5 చుక్కల లావెండర్ నూనె, గుప్పెడు గులాబీ రేకులు చేర్చి 15-20 నిమిషాలు స్నానం చేయాలి. ఇలా చేస్తే కండరాలు రిలాక్స్ అవుతాయి. మనసు, శరీరం హాయిగా ఉంటాయి.