KDP: యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కమాండెంట్ కే.ఆనంద్ రెడ్డి పేర్కొన్నారు. సిద్ధవటం మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP11 పోలీసు బెటాలియన్ గ్రౌండ్లో ఆదివారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కమాండెంట్ మాట్లాడుతూ.. యోగ అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. యోగాతో శారీరక రుగ్మతలు దూరమవుతాయన్నారు.