KMR: ప్రస్తుతం తమ దృష్టంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలపైనే ఉందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో గణేష్ మండపాల నిర్వాహకులతో శనివారం సాయంత్రం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నిమజ్జనం తేదీ కూడా తెలియజేయాలన్నారు.