NLG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు CPS విధానం రద్దు చేసి వెంటనే OPS విధానాన్ని అమలు పరచాలని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తపస్ నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం భోజన విరామ సమయంలో కొండమల్లేపల్లి తాసీల్దార్ నరేందర్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు.