NZB: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో నీలం రామచంద్రయ్య భవన్ కోటగల్లి కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డా.కర్క గణేష్ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలు పరిష్కార దిశగా PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం 25 తేదీ నుండి 30 వరకు జరిగే విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయలన్నారు.