MDK: రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రామానికి సమీపాన ఉన్న చిన్న చెరువు నిండుకుండల మారింది. ఎగువ ప్రాంతం నుంచి భారీ వరదరావడంతో అలుగు పారుతుంది. చెరువులో పూర్తిస్థాయి నీరు లభ్యమవడంతో ఈసారి వ్యవసాయానికి ఎటువంటి సాగునీటి కొరత ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేశారు.