KDP: 60 వేలకు పైగా జనాభా ఉన్న వేంపల్లి మేజర్ పంచాయతీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందని పీసీసీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని ఈ పంచాయతీలో సచివాలయ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు లేవని, పారిశుధ్యం అధ్వానంగా ఉందని ఆయన ఆరోపించారు.