KRNL: కోసిగి మండలం కామన్ దొడ్డి గ్రామం సమీపంలోని పొలాల్లో మంగళవారం ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పొలాల్లో పనిచేస్తున్న రైతులు ఈ శవాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహం నుంచి అనేక ఆధారాలను పరిశీలించి, ఆ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.