W.G: ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించే దిశగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కాళ్ల మండలం యూత్ క్లబ్ రోడ్ సాయిబాబా గుడి శివారు ప్రాంతంలో ఉన్న లే అవుట్లకు నిబంధనల ప్రకారం వదిలిన 10 శాతం ఖాళీ స్థలాలను కలెక్టర్ పరిశీలించారు.