SDPT: గజ్వేల్ మండలంలోని జాలిగామ గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భూసార పరీక్ష ఉపయోగాల గురించి అవగాహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డీస్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ సాయికుమార్ మాట్లాడుతూ.. రైతులు విచక్షణా రహితంగా ఎరువులు వాడటం వలన నేల సారం దెబ్బతిని పంట ఎదుగుదల, దిగుబడిపై దీర్ఘకాలికంగా ప్రభావం చూపిస్తుందన్నారు.