NDL: నందికొట్కూరు పట్టణం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు. మంగళవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో పైపులైన్ పనుల కారణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మరో దారి ఏర్పాటు చేశామని చెప్పారు. కుక్కల బెడద, నీటి సమస్యలను కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.