KRNL: రెండు రాష్ట్రాలలోనే అనేక గ్రామాలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఓ కల్పతరువు వంటిదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తెలిపారు. మంగళవారం తుగ్గలి మండలం లక్ష్మీతండాలో దేవర ఉత్సవాలలో పాల్గొన్న సందర్భంగా ఆమె గిరిజనులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆర్డీటీకి ఒక మతం, ఒక ప్రాంతం అనేది లేదని స్పష్టం చేశారు.