IPL 2025లో భాగంగా నేడు RCBతో రాజస్థాన్ తలపడనుంది. ఈ క్రమంలో RR కెప్టెన్ సంజూ శాంసన్ ఆరోగ్య పరిస్థితిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం సంజూ ఆరోగ్యంగా లేడని.. వైద్య బృందం ఆడటానికి అనుమతి ఇవ్వలేదని తెలిపాడు. వైద్యుల సలహా మేరకు వచ్చే మ్యాచ్లలో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించాడు.