»The Thugs Poured Petrol On The Software Engineer And Set Him On Fire
Tirupati District : సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై పెట్రోలు పోసి నిప్పటించిన దుండగులు !
తిరుపతి జిల్లా (Tirupati District) లో దారుణం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం (Chandragiri Mandal) గుంగుడుపల్లెలో దుండుగులు కారుపై పెట్రోల్‌పోసి నిప్పటించడంతో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు . కారు నంబర్‌ప్లేట్ ఆధారంగా మృతుడిని వెదురుకుప్పం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను(Software Engineer) ఆపిన దుండగులు ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
తిరుపతి జిల్లా (Tirupati District) లో దారుణం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం (Chandragiri Mandal) గుంగుడుపల్లెలో దుండుగులు కారుపై పెట్రోల్‌పోసి నిప్పటించడంతో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు . కారు నంబర్‌ప్లేట్ ఆధారంగా మృతుడిని వెదురుకుప్పం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను(Software Engineer) ఆపిన దుండగులు ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కారు నుంచి బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బాధితుడు కారులోనే దగ్దమైనడు.
చంద్రగిరి మండలంలోని నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో గుంగుడుపల్లె వద్ద జరిగిందీ ఘటన. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండడంతో కారు నంబరు ఆధారంగా వివరాలు సేకరించారు. బెంగళూరు(Bangalore) లోని ఓ సాఫ్ట్వేర్ (Software) సంస్థలో ఆయన పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి బెంగళూరు నుంచి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి(Brahmanapalli)కి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఘటనకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.