KMM: జిల్లాలో వాతావరణం నిప్పులకొలిమిని తలపిస్తోంది. మంగళవారం జిల్లాలోనే ఎర్రుపాలెంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ముదిగొండ (బాణాపురం), నేలకొండపల్లిలో 42.8, కామేపల్లి (లింగాల), కారేపల్లి 42.7, వైరా 42.5, ఖమ్మం అర్బన్ 42.4, వేంసూరు, మధిర 42.3, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.1, రఘునాథపాలెం 41.5 నమోదైంది.